Home  »  TV News  »  Jayam serial : ప్రీతి శ్రీమంతం వేడుకలో ఊహించని మలుపు.. వీరు కుతంత్రాలకు విశ్వ గట్టి కౌంటర్!

Updated : Jun 13, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -293 లో.... శకుంతల, పెద్దసారు ఇద్దరు ప్రీతి శ్రీమంతానికి సుధాని పిలవడానికి వెళ్తారు. అప్పుడే ఇంట్లో గొడవ జరగాలని వీరు అనుకుంటాడు. విశ్వకి వీరు ఫోన్ చేసి.. మీ ఇంట్లో ఇప్పుడు విజయేంద్ర ప్రతాప్ శకుంతల ఉన్నారని చెప్తాడు. దాంతో విశ్వకి కోపం వస్తుంది. విశ్వ వచ్చి ఇంట్లో గొడవ చేస్తాడని, వాళ్లని అవమనిస్తాడని వీరు, ఇషిక అనుకుంటారు.

ఆ తర్వాత  విశ్వకి సుధా కాల్ చేసి.. మా అన్నయ్య వాళ్ళు వచ్చారు.. మీరు త్వరగా ఇంటికి రమ్మని చెప్తుంది. ఫోన్ రుద్ర తీసుకొని మావయ్య మీరు త్వరగా ఇంటికి రండి.. మీ కోసం ఇంట్లో వెయిట్ చేస్తున్నామని రుద్ర అంటాడు. ఆ తర్వాత విశ్వ కోపంగా ఇంటికి వస్తాడు. తన కోపం చూసి ఇంట్లో వాళ్ళని మెడపట్టుకొని గెంటెయ్యడం ఖాయమని వీరు, ఇషిక అనుకుంటారు కానీ విశ్వ రాగానే రుద్ర తనతో బాగా మాట్లాడతాడు పెద్దసారు కూడా బాగా మాట్లాడతాడు. శకుంతల బొట్టు పెట్టి మరీ సుధాని ఆహ్వానిస్తుంది. మీరు ఇద్దరు తప్పకుండా రావాలి విశ్వ అని పెద్దసారు చెప్తాడు. మీరు కుటుంబంతో వచ్చి పిలవడం అది మీ సంస్కారం.. నేను రావడం అనేది నా సంస్కారం అని విశ్వ సాఫ్ట్ గా మాట్లాడుతుంటే.. వీరు, ఇషిక షాక్ అవుతారు. ఆ తర్వాత విశ్వని పెద్దసారు హగ్ చేసుకొని జరిగింది మర్చిపోయి ఇంటికి రా విశ్వ అని చెప్తాడు. మరొకవైపు అక్కడ విశ్వ సర్ ఉన్నా.. గొడవ జరగలేదని గంగ, రంగా,ఇందుమతి, రాఘవ వాళ్ళు ఆశ్చర్యంగా మాట్లాడుకుంటారు 

సుధా అత్త కూతురు వచ్చింది కదా.. అన్నయ్యకి పెళ్లి అవ్వకుంటే తనకి ఇచ్చి పెళ్లి చేసేవారని  గంగని స్నేహ, ప్రీతీ వాళ్ళు ఆటపట్టిస్తారు. ఆ తర్వాత చాలా థాంక్స్ అని విశ్వ కాళ్ళు పట్టుకుంటుంది సుధా.. మా వాళ్ళు వచ్చినా మీరు మర్యాదగా మాట్లాడారు. థాంక్స్ అని సుధా అంటుంటే.. ఏం చేసినా నీ కోసమే అని విశ్వ అంటాడు. అయితే శ్రీమంతానికి వస్తున్నారు కదా అని సుధా అనగానే వస్తానని విశ్వ అంటాడు. రెండు కుటుంబాలు కలిసిపోతే మేం అనుకున్నది ఎలా జరుగుతుందని నిషా అనుకొని నాన్నని ఎందుకు ఫోర్స్ చేస్తున్నావమ్మా అని అడుగుతుంది. నోరు ముయ్.. నువ్వు ఇలాంటి విషయల గురించి మాట్లాడవద్దని తనని విశ్వ కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.